Home  »  TV News  »  Brahmamudi: సంతకం ఫోర్జరీ చేసిందని ఆరోపించిన రుద్రాణి.. కావ్యకి షాక్!

Updated : Apr 25, 2025

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-704లో.. అపర్ణ, కావ్య మాట్లాడుకుంటారు. ఏం చేస్తున్నావే నువ్వు.. అంత నమ్మకంగా రుద్రాణీకి మాట ఇచ్చేసి వచ్చావని అపర్ణ అంటుంది. లేకపోతే ఆయన డెత్ సర్టిఫికెట్ కావాలని అడుగుతుందా? వయసులో పెద్దదని ఊరుకున్నా అత్తయ్యా.. లేదంటే చెంపలు పగలగొట్టేదాన్ని అని కావ్య అంటుంది. దాని సంగతి నేను చూసుకుంటానులే కానీ.. ముందు ఇప్పుడొచ్చిన సమస్య గురించి ఏం ఆలోచించావ్.. రాజ్ వచ్చి కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి వాడికి గతమే గుర్తు లేదు కదా.. ఎలా ఇప్పుడని అపర్ణ అంటుంది. ఆయన రావాల్సిన పని లేదు.. నా పేరు మీద పవర్ ఆఫ్ పటార్నీ ఉంటే చాలు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నేను పూర్తి చేయగలనని కావ్య అంటుంది. నీ ఆలోచన బాగానే ఉంది.. నువ్వు అనుకున్నట్లు జరగాలంటే రాజ్ కనీసం సంతకం అయినా చెయ్యాలి కదా.. వాడికి వాడి పేరే గుర్తు లేదు. అలాంటప్పుడు ఎలా సంతకం చేస్తాడని అపర్ణ అంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అత్తయ్యా.. ఆయన్ని కలవమని చెప్పాను.. కలిశాక ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని కావ్య అంటుంది. నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు కావ్యా.. ఏం చేస్తావో ఏంటో అని భయంగా ఉందని అపర్ణ అంటుంది. అత్తయ్యా మీరేం ఆలోచించకండి.. మనకు ఏ తోడు లేనప్పుడు పంచబూతాలే తోడుగా ఉంటాయి. తాతయ్య గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆయన్ను అనామిక అరెస్ట్ చేయించినప్పుడు నా చుట్టు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.. ఇప్పుడూ అంతే.. మీరు కంగారు పడకండి అని ధైర్యం చెప్పి కావ్య కారులో బయల్దేరుతుంది. కారు ఎక్కగానే రాజ్‌కి కావ్య కాల్ చేసి.. రామ్ గారు.. మిమ్మల్ని కలవాలి.. వెంటనే రండి.. కాస్త ముఖ్యమైన విషయం మాట్లాడాలి.. ఎప్పుడూ కలిసే కాఫీ షాప్‌లో ఎదురుచూస్తుంటాననేసి ఫోన్ పెట్టేస్తుంది. మీరు నన్ను పిలవడమేంటీ.. ఆ ముఖ్యమైన విషయం ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు కానీ వేటికీ కావ్య సమాధానం చెప్పదు. దాంతో రాజ్ బయల్దేరి వస్తాడు.

ఇక రాజ్ కిందకి వస్తుంటే యామినీ, వైదేహి, రఘునందన్‌లతో పాటు పంతులు కూడా ఉంటాడు. ఇక పంతులతో వైదేహి.. మంచి ముహూర్తం పెట్టండి పంతులు గారు అంటుంది. బేబీ.. అల్లుడుగారిని కూడా పిలిస్తే బెటర్ కదా.. మళ్లీ ఆయనకు చెప్పలేదని ఫీల్ అవుతారేమోనని యామిని నాన్న అంటాడు.  లేదు డాడ్.. మనకు ఆసుపత్రిలోనే మాట ఇచ్చాడు కదా.. తప్పడు.. మన ఇష్టం అని చెప్పేశాడు కదా అంటుంది. ఇంతలో రాజ్ కిందకు దిగి.. వాళ్లను చూసి కూడా చూడనట్లుగా బయటికి వెళ్తుంటాడు. వెంటనే రఘునందన్.. బాబు.. పెళ్లి మూహూర్తం పెట్టిస్తున్నాం.. మీరు ఉంటే బాగుంటుందని రాజ్ అంటాడు. లేదు అంకుల్ నాకు చిన్న పని ఉంది.. మీరు పెద్దవాళ్లు ఎలా నిర్ణయిస్తే అలానే.. మీరు కానివ్వండి అనేసి రాజ్ బయటికి నడుస్తాడు. విన్నారా డాడ్.. రాజ్ మన నిర్ణయానికి నో చెప్పడని నేను చెప్పాగా.. ఇక కానివ్వండి అంటుంది యామినీ సంబరంగా. ఇక పంతులు ముహూర్తం చూసి..వచ్చే నెల 26న దివ్యమైన ముహూర్తం ఉందండి అని అంటాడు. పోనీలే పనులకు టైమ్ దొరుకుతుందని వైదేహి అంటుంది. అంత లేట్‌గా ఎందుకు మామ్.. దగ్గరల్లో ఏదైనా డేట్ చూడమనండి అని యామిని అంటుంది. జాతకాలు చూసి పెళ్లి చేస్తేనే మీరిద్దరు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు.. ఏం కాదులేమ్మా. అంటూనే.. పంతులుగారు మీరు అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి అని వైదేహి అంటుంది. 

మరోవైపు రాజ్, కావ్య మాట్లాడుకుంటారు. మా బాస్ ఫారెన్ వెళ్తూ వెళ్తూ పవర్ ఆఫ్ అటార్నీ నా పేరున వచ్చేలా సంతకం చేసి లెటర్ హెడ్ నాకు ఇచ్చారు. నేను దాన్ని పోగొట్టేశాను.. తీరా ఇప్పుడు పనులన్నీ ఆగిపోయాయి. ఈ విషయం మా బాస్‌కి తెలిస్తే నా జాబ్ పోతుంది. అందుకే నాకు మీరు ఒక సాయం చెయ్యాలి. సేమ్ లెటర్ హెడ్ రెడీ చేయించి తీసుకొచ్చాను.. దాని మీద మీరు మా బాస్ సంతకం ఒకటి చేశారంటే చాలు.. నేను ఈ సమస్య నుంచి బయటపడిపోతానంటూ కావ్య చెప్తుంది. అమ్మో నా వల్ల కాదు.. ఫోర్జరీ అవుతుంది ఇది అనేసి రాజ్ నో చెప్తాడు. సరే మీరు వెళ్లండి.. నేను ఆ సంతకం ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటానని కావ్య కోపంగా అనేస్తుంది. రాజ్ నిజంగానే లేచి వెళ్లిపోతుంటే.. అయ్యో నిజంగానే వెళ్లిపోతున్నారే అని చూస్తూ కావ్య బాధపడుతుంది. ఇక రాజ్ డోర్ దగ్గరకు వెళ్లి వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి వస్తాడేమోనని కావ్య ఆశపడుతుంది. కానీ ఆగడు వెళ్లిపోతాడు. దాంతో కావ్య.. అయ్యో.. సర్లే వెళ్తే వెళ్లనీ నేనే సంతకం ప్రాక్టీస్ చేసి నేనే పెట్టుకుంటాను అని కావ్య అనుకుని సంతకం ప్రాక్టీస్ చేసే పనిలో పడుతుంది. ఓ వ్యక్తి రుద్రాణీకి కాల్ చేసి.. మేడమ్ థాంక్యూ.. మీరు చెప్పినట్లు ఇంటికి వచ్చి అడగటం వల్లే ఇప్పుడు మా రెండు కోట్లు మాకు వచ్చేశాయి.. కావ్య మేడమ్ మా డీల్ సెటిల్ చేశారు.. థాంక్యూ మేడమ్.. రాజ్ సర్ సంతకం చేశారట.. ఆ డాక్యుమెంట్స్ మాకు పంపించారు. అంతా మీ వల్లే థాంక్యూ మేడమ్ అని అతను అంటాడు. థాంక్స్ ఏం అవసరం లేదు కానీ.. కావ్య పంపించిన డాక్యుమెంట్స్ పేపర్ నాకు మెయిల్ చెయ్ చాలు అని రుద్రాణి అంటుంది. సరే మేడమ్ పంపిస్తానని అతడు ఫోన్ పెట్టేసి.. ఆ డాక్యుమెంట్ పేపర్స్ పంపిస్తాడు. ఎంతకు తెగించావ్ కావ్యా.. రాజ్ చచ్చాడని ఒప్పుకుంటావ్ అనుకుంటే వాడి సంతకాన్ని ఫోర్జరీ చేసి కంపెనీ బాధ్యతలను నువ్వు తీసుకుంటావా.. నువ్వు చేసిన ఈ తప్పుని ఎలా బయటపెడతానో చూడమని రుద్రాణి రగిలిపోతుంది. ఆ వ్యక్తి పంపించిన డాక్యుమెంట్స్ ప్రింట్‌ని.. ఇంట్లో వాళ్ల ముందు పెట్టి రుద్రాణి రచ్చరచ్చ చేస్తుంది. ఆధారాలతోనే వచ్చాను.. ఇవిగో చదవండి.. రాజ్ లేకుండా కావ్యకు పవర్ ఆఫ్ పటార్నీ ఎలా వచ్చిందంటూ రుద్రాణి అనేసరికి అందరు ఆశ్చర్యపోతారు. ఇంతలో కావ్య రావడంతో తన చేతిలో ఆ డాక్యుమెంట్స్ పెట్టి షాకిస్తుంది రుద్రాణి. డాక్యుమెంట్స్‌లో రాజ్ సంతకం గురించి ఇంట్లో రచ్చ చేస్తుంటే కావ్య దోషిలా నిలబడి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.